ఏబీ వెంకటేశ్వరావుకు షాకిచ్చిన క్యాట్

ఏబీ వెంకటేశ్వరావుకు షాకిచ్చిన క్యాట్

ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్) షాకిచ్చింది. ఆయనపై విధించిన సస్పెన్షన్ ను రద్దు చేసేందుకు నిరాకరించింది. ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. సర్వీస్ నిబంధనలను అతిక్రమించి నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలతో ఏపీ సర్కారు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలటంతో సస్పెండ్‌ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్ ను ఆశ్రయించారు. పిటిషన్ ను విచారించిన క్యాట్… సస్పెన్షన్ ను రద్దు చేసేందుకు నిరాకరించింది. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది.