హైకోర్టు అడ్వకేట్ దంపతుల హత్య కేసులో ..సీబీఐ విచారణకు పుట్ట మధు

హైకోర్టు అడ్వకేట్ దంపతుల హత్య కేసులో ..సీబీఐ విచారణకు పుట్ట మధు

గోదావరిఖని, వెలుగు: హైకోర్టు అడ్వకేట్లు గట్టు వామన్‌‌‌‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో పెద్దపల్లి జిల్లా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సీబీఐ విచారణకు హాజరయ్యారు. గురువారం రామగుండం పోలీస్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌ ఆఫీసులో సీబీఐ ఆఫీసర్లను ఆయనను విచారించారు. 

2021 ఫిబ్రవరి 17న రామగిరి మండలం కల్వచర్ల గ్రామం వద్ద కారులో వెళ్తున్న అడ్వకేట్లను అడ్డగించి హత్య చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో దర్యాప్తు కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో సీబీఐ అధికారులు ఇప్పటివరకు సుమారు 140 మందిని విచారించినట్లు సమాచారం. కాగా, ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఇప్పటివరకు మూడు సార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు.