సీజీహెచ్ఎస్  మందుల సప్లైలో గోల్‌‌‌‌మాల్‌‌‌‌ ..ఫార్మా కంపెనీ, మెడికల్‌‌‌‌ షాప్స్‌‌‌‌తో ఉద్యోగుల కుమ్మక్కు

సీజీహెచ్ఎస్  మందుల సప్లైలో గోల్‌‌‌‌మాల్‌‌‌‌ ..ఫార్మా కంపెనీ, మెడికల్‌‌‌‌ షాప్స్‌‌‌‌తో ఉద్యోగుల కుమ్మక్కు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందించే మందుల సప్లైలో భారీ గోల్‌‌‌‌మాల్‌‌‌‌ జరిగింది. యాంటీ ఆక్సిడెంట్స్‌‌‌‌, బి కాంప్లెక్స్‌‌‌‌ సహా పలు రకాల మందుల సప్లైలో 2022 నుంచి 2025 వరకు అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులతో సీబీఐ హైదరాబాద్‌‌‌‌ జోన్‌‌‌‌ కార్యాలయం మంగళవారం ఎఫ్‌‌‌‌ఐఆర్  నమోదు చేసింది. బేగంపేట కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీజీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ ఉద్యోగులు, మందులు సరఫరా చేసే ఫార్మా కంపెనీ.. మెడికల్  షాప్‌‌‌‌ నిర్వాహకులతో కుమ్మక్కై బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడినట్లు తేల్చింది.

ఈ మేరకు సీనియర్  ఫార్మాసిస్ట్‌‌‌‌ వైఎల్ఎన్  మూర్తితో పాటు ఆరుగురు సీజీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ ఉద్యోగులను, లార్వెన్  ఫార్మా అండ్‌‌‌‌ సర్జికల్స్  ఓనర్​ రమణయ్య  (సికింద్రాబాద్‌‌‌‌) , న్యూ ఎస్ఎస్  మెడికల్  అండ్‌‌‌‌  జనరల్  స్టోర్స్ (వారాసిగూడ)  నిర్వాహకుడు చిరంజీవిని నిందితులుగా చేర్చింది. మందుల సప్లయర్లకు అనుకూలంగా కొటేషన్లు, మందుల సరఫరాను కోరుతూ ఆఫీస్  నోట్లను ప్రాసెస్  చేయడం, నోట్  ఆర్డర్లు, సప్లై ఆర్డర్ల చేసినట్లు గుర్తించింది. ఈ మేరకు సీజీహెచ్‌‌‌‌ఎస్‌‌‌‌ ఉద్యోగులు, లార్వెన్  ఫార్మా, న్యూ ఎస్ఎస్  మెడికల్  నిర్వాహకుల మధ్య ముడుపులు చేతులు మారినట్లు వెల్లడించింది.