నీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ కుంభకోణం

V6 Velugu Posted on Sep 24, 2021

న్యూఢిల్లీ:  వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్ ఎంట్రెన్స్ లో భారీ కుంభకోణం బయటపడింది. రూ. 50 లక్షలు చెల్లిస్తే.. గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీలో సీట్​వచ్చేలా.. ఇతర వ్యక్తులతో ఎగ్జామ్​ రాయిస్తామని మహారాష్ట్రలోని ఓ కోచింగ్​ సెంటర్​ పలువురు అభ్యర్థులతో ఒప్పందం చేసుకున్నట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ఈ మేరకు కోచింగ్​ సెంటర్ ​డైరెక్టర్ సహా పలువురు స్టూడెంట్స్​ను అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వర్గాలు బుధవారం తెలిపాయి. కేసు ఎఫ్​ఐఆర్​లో పేర్కొన్న వివరాల ప్రకారం.. మహారాష్ట్ర బేస్డ్​ ఆర్కే ఎడ్యుకేషన్ ​కెరీర్​ గైడెన్స్ నీట్ ​స్టూడెంట్స్​కు కోచింగ్​ నిర్వహిస్తోంది. ఈ ఏడాది నీట్​ ఎంట్రెన్స్​లో మంచి ర్యాంకుతో గవర్నమెంట్ ​మెడికల్ ​కాలేజీలో సీట్ వచ్చేలా చేస్తామని.. అందుకు అభ్యర్థి రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని కోచింగ్ ​సెంటర్​ డైరెక్టర్ ​పరిమల్​ కొత్పల్లివార్ ​పలువురు స్టూడెంట్స్​తో ఒప్పందం చేసుకున్నాడు. ​ఈమేరకు సీట్లు వచ్చాకే డబ్బులు మొత్తం ఇచ్చేలా పోస్ట్​ డేటెడ్​ చెక్​లు ఇవ్వాలని చెప్పాడు. ఎగ్జామ్​  ఆన్​లైన్​లో కాబట్టి యూజర్​ ఐడీ, పాస్​వర్డ్, ఆధార్ ​వివరాలు ఇస్తే.. నకిలీ ఐడీ కార్డులు సృష్టించి ఇతర అభ్యర్థులతో పరీక్ష రాయిస్తామని చెప్పాడు. ఒక వేళ అలా కుదరకపోతే ఎగ్జామ్ ​టైంలో ఆన్సర్​ షీట్​ఇవ్వడం గానీ, ఓఎంఆర్​ మార్చడం గానీ చేస్తామని అగ్రిమెంట్ చేసుకున్నాడు. అసలు స్టూడెంట్స్​కు బదులుగా మొత్తం అయిదుగురు ఇతర వ్యక్తులు ఎగ్జామ్​కు అటెండ్​ అయ్యేలా నకిలీ ఐడీ కార్డులు తయారు చేశారు. విషయం సీబీఐ అధికారులదాకా చేరడంతో ఎగ్జామ్ ​సెంటర్​లోనే నిందితులను రెడ్​హ్యాండెడ్​గా పట్టుకోవాలని ప్లాన్​ వేశారు. ఈ నెల 12న నీట్​ఎగ్జామ్​ రోజు సెంటర్ల వద్ద వేచి ఉన్నారు. కానీ వాళ్లు ఎగ్జామ్​కు హాజరుకాలేదు. వెంటనే సీబీఐ ఆఫీసర్లు సంబంధిత కోచింగ్​సెంటర్​లో సోదాలు చేసి వివరాలు సేకరించారు. నిందితులను అరెస్ట్​ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.

Tagged scam, cbi, NEET Medical Exams

Latest Videos

Subscribe Now

More News