UGC NET 2024 ఎగ్జామ్ పేపర్ లీక్ పై సీబీఐ కేసు నమోదు

UGC NET 2024 ఎగ్జామ్ పేపర్ లీక్ పై సీబీఐ కేసు నమోదు

విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం నిర్వహించిన యూజీసీ-నెట్ ‌(UGC NET 2024) పరీక్షలో రాజీ పడి ఉండవచ్చని నివేదికలు రావడంతో ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) వెల్లడించిన విషయం తెలిసిందే. ఇది జరిగిన ఒకరోజు అనంతరం కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సూచనలపై గుర్తు తెలియని వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.  

పరీక్షల సమగ్రత దెబ్బతినే అవకాశం ఉందన్న ఇన్‌పుట్‌ల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన యూజీసీ-నెట్‌ను రద్దు చేస్తూ విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశించిందని, సమగ్ర దర్యాప్తు కోసం ఈ విషయాన్ని సీబీఐకి అప్పగించామని అధికారులు తెలిపారు. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్‌(NEET)లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై తీవ్ర దుమారం రేగడంతో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది.