సీబీఎస్సీ 10వ తరగతి ఫలితాలు విడుదల..

సీబీఎస్సీ 10వ తరగతి ఫలితాలు విడుదల..

సీబీఎస్సీ 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి..మంగళవారం ( మే 13 ) సీబీఎస్సీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ శాన్యం భరద్వాజ్ ఫలితాలను అనౌన్స్ చేశారు. ఈ ఏడాది పదవ తరగతిలో 93.60శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 0.06 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఈ ఏడాది కూడా బాలికలదే పైచేయి కావడం గమనార్హం. అబ్బాయిల కంటే అమ్మాయిలు 2.37శాతం ఎక్కువ పాయింట్లతో ముందంజలో ఉన్నారు. 95శాతం మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా.. 92. 63శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు.

తిరువనంతపురం, విజయవాడలో అత్యధికంగా 99.79% ఉత్తీర్ణత శాతం నమోదయ్యింది, తర్వాతి స్థానాల్లో బెంగళూరు 98.90శాతం, చెన్నై 98.71 శాతం నమోదయ్యింది. జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులు 99.49శాతం ఉత్తీర్ణత శాతం సాధించగా..  పాఠశాలల్లో అత్యధికంగా కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు 99.45శాతం ఉత్తీర్ణత సాధించారు.

Also Read : సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాలు విడుదల

ఈ ఏడాదికి సంబంధించి దేశవ్యాప్తంగా 7 వేల 842 సెంటర్లలో పరీక్షలు నిర్వహించింది సీబీఎస్సీ. 10, 12వ తరగతుల పరీక్షలకు ఈ ఏడాది సుమారు 42లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. దీంతో పాటు 26 దేశాల్లో కూడా పరీక్షలు నిర్వహించింది సీబీఎస్సీ. ఓవరాల్ గా ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు 24.12 లక్షల మంది హాజరు కాగా.. 12వ తరగతి పరీక్షలకు 17.88 లక్షల మంది హాజరయ్యారు.

ఫలితాల కోసం https://cbseresults.nic.in/ క్లిక్ చేయండి