Job News: సీసీఐలో మేనేజర్ పోస్టులు

Job News: సీసీఐలో మేనేజర్ పోస్టులు

కాటన్ కార్పొరేషన్ ఆఫ్  ఇండియా(సీసీఐ) మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.  
పోస్టులు: మేనేజర్ 07, డిప్యూటీ మేనేజర్ 06.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎంఎంఎస్, పీజీడీఎంలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
అప్లికేషన్: ఆఫ్​​లైన్ ద్వారా. చిరునామా చీఫ్ జనరల్ మేనేజర్(హెచ్ఆర్ డీ), ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా లిమిటెడ్, ఐదో అంతస్తు, కపాస్ భవన్, ప్లాట్ నెం 3ఏ, సెక్టార్–10, సీబీడీ బేల్ పూర్, నవీ ముంబయి. 
లాస్ట్ డేట్: జులై 16. 
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.