డిగ్రీ అర్హతతో సీసీఐలో టెంపరరీ జాబ్స్.. ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ మాత్రమే..

డిగ్రీ అర్హతతో సీసీఐలో టెంపరరీ జాబ్స్.. ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ మాత్రమే..

కాటన్ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా(సీసీఐ) ఫీల్డ్ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. సెప్టెంబర్ 22 నుంచి 23 వరకు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.  

పోస్టులు: టెంపరరీ ఫీల్డ్ స్టాఫ్, టెంపరరీ ఆఫీస్ స్టాఫ్(ఏ/ సీ), టెంపరరీ ఆఫీస్ స్టాఫ్(జనరల్).

ఎలిజిబిలిటీ

  • టెంపరరీ ఫీల్డ్ స్టాఫ్ పోస్టులకు జనరల్/ ఓబీసీ అభ్యర్థులు  50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు 45 శాతం మార్కులతో బీఎస్సీ అగ్రికల్చరల్​ పూర్తి చేసి ఉండాలి. 
  • టెంపరరీ ఆఫీస్ స్టాఫ్(ఏ/ సీ) పోస్టులకు  జనరల్/ ఓబీసీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు 45 శాతం మార్కులతో బి.కాం పూర్తి చేసి ఉండాలి. 
  • టెంపరరీ ఆఫీస్ స్టాఫ్ (జనరల్) పోస్టులకు  జనరల్/ ఓబీసీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 35 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
వాక్ ఇన్ ఇంటర్వ్యూలు: సెప్టెంబర్ 22 నుంచి 25 వరకు.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు cotcorp.org.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 

►ALSO READ | హైదరాబాద్ సీడీఎఫ్డీలో టెక్నికల్ జాబ్స్.. టెన్త్ నుంచి బీటెక్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు..