
హైదరాబాద్‌లోని బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్‌కు చెందిన సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయోగ్నోస్టిక్స్(సీడీఎఫ్‌డీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 30.
పోస్టుల సంఖ్య: 09
పోస్టులు: టెక్నికల్ ఆఫీసర్– I 01, టెక్నికల్ అసిస్టెంట్ 02, జూనియర్ మేనేజిరియల్ అసిస్టెంట్ 02, జూనియర్ అసిస్టెంట్– II 02, స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్–-II 02.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బి.టెక్ లేదా బీఈ, పీజీ, పీజీ డిప్లొమా, పదోతరగతిలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 25 నుంచి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30.
పూర్తి వివరాలకు cdfd.org.in వెబ్సైట్లో
సంప్రదించగలరు.