దొంగల ముఠా అరెస్ట్…నగలు,నగదు స్వాధీనం

దొంగల ముఠా అరెస్ట్…నగలు,నగదు స్వాధీనం

హైదరాబాద్ లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పట్టుకున్నారు సీసీఎస్ శంషాబాద్ పోలీసులు. రాత్రి సమయంలో ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి 17.5 తులాల బంగారం, 300 తులాల వెండి వస్తువులు తో పాటు 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు హైదరాబాద్ సీపీ సజ్జనార్.

రాజేంద్రనగర్ లోని ఓ ఇంట్లో దొంగతనం చేయడనికి ప్రయత్ని చేస్తుండగా ఈ ముఠాను పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్. రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో ఈ ముఠాపై చాలా కేసులు ఉన్నాయన్నారు. గ్యాంగ్ ప్రధాన నిందితుడు కోసురి శ్రీనివాసరావు గుంటూరు జిల్లా కు చెందిన వాడని… చిలకలూరిపేటలో ప్రైవేట్ టీచర్ గా ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పారు. శ్రీనివాస రావు ఒక గ్యాంగ్ ను ఏర్పటు చేసుకొని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. ఇప్పటి వరకు 48 దొంగతనల్లో శ్రీనివాస రావు పాల్గొన్నట్లు తెలిపారు.

దొంగతనం కేసులో అరెస్టై 16 జూలై న ఒంగోలు జిల్లా జైలు నుంచి రిలీజ్ అయిన శ్రీనివాసరావు మళ్ళీ దొంగతనాలు చేయడం మొదలు పెట్టినట్లు తెలిపారు. రాత్రి సమయాలలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని రెక్కీ నిర్వహించి ఈ ముఠా సభ్యులు దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. శ్రీనివాస రావు తో పాటు నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశామన్న సీపీ.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని…గుర్తు తెలియని వ్యక్తులకు ఇంటిని అద్దెకు ఇవ్వకూడదని సూచించారు.