కేరళలో యూడీఎఫ్ గెలుపుతో గాంధీ భవన్‌‌లో సంబురాలు

కేరళలో యూడీఎఫ్ గెలుపుతో గాంధీ భవన్‌‌లో సంబురాలు
  • ‘గేమ్ చేంజర్’ రేవంత్ రెడ్డి అంటూ ఫ్లెక్సీల ప్రదర్శన

హైదరాబాద్, వెలుగు: కేరళలో యూడీఎఫ్ ఘన విజయం సాధించడంతో సోమవారం గాంధీభవన్‌‌లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో పార్టీ క్యాడర్ పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకుని, డప్పు చప్పుళ్లతో డ్యాన్స్‌‌లు చేస్తూ తమ సంతోషాన్ని పంచుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఫొటోలతో కూడిన ‘గేమ్ చేంజర్’ రేవంత్ రెడ్డి అనే ఫ్లెక్సీలు ప్రదర్శించారు. కేరళ గెలుపులో రేవంత్ రెడ్డి ప్రచారం, ఆయన వ్యూహాలే ప్రధాన పాత్ర పోషించాయంటూ కార్యకర్తలు చేసిన నినాదాలు గాంధీ భవన్ పరిసరాల్లో మార్మోగిపోయాయి. అనంతరం మెట్టు సాయి మీడియాతో మాట్లాడారు. కేరళలో యూడీఎఫ్ గెలుపుతో జాతీయ కాంగ్రెస్‌‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ట పెరిగిందని తెలిపారు. ఆ రాష్ట్రంలో యూడీఎఫ్ విజయం.. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ గెలుపుకు నాంది కానుందని చెప్పారు.