సికింద్రాబాద్లో సెల్ ఫోన్ దొంగలు అరెస్ట్

సికింద్రాబాద్లో సెల్ ఫోన్ దొంగలు అరెస్ట్

రైళ్లలో ప్రయాణిస్తున్న అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి.. రిమాండ్ కు తరలించారు. నిందితుల నుంచి 10 లక్షల విలువైన 66 సెల్ ఫోన్లు,ల్యాప్ టాప్, నగదు స్వాధీనం చేసుకున్నట్లు రైల్వే పోలీస్ షేక్ సలీమ తెలిపారు. 

రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ లపై, రైలు ఎక్కేటప్పుడు ఒంటరిగా ఉన్న ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్నట్లు వివరించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జీఆర్ పీ, ఆర్ పీఎఫ్ పోలీసులు తనిఖీలలో భాగంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న 6 మంది వ్యక్తులను విచారించగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైనట్లు రైల్వే ఎస్పీ సలీమా తెలిపారు.

కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మాణిక్,దిలీప్ పాటిల్ లతో కలిసి హైదరాబాద్ నగరానికి చెందిన చైతన్య, రిజ్వాన్ ,శంకర్, మాణిక్యం లు సెల్ఫోన్ చోరీలను చేస్తూ మహారాష్ట్ర,హైదరాబాద్ లో విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న ప్రతి ఒక్కరూ ఫిర్యాదు చేస్తే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సులువుగా గుర్తించవచ్చని సూచించారు.