మా దేశంలో ఎక్కడైనా సమావేశాలు పెట్టుకుంటం

మా దేశంలో ఎక్కడైనా సమావేశాలు పెట్టుకుంటం
  • కాశ్మీర్​లో జీ20 సదస్సు నిర్వహించడంపై చైనాకు కేంద్రం కౌంటర్

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్​లో జీ20 మీటింగ్ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ చైనా చేసిన కామెంట్లపై మన దేశం మండిపడింది. ఈ నెల 22 నుంచి 24 వరకు శ్రీనగర్ లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జరగనుంది. అయితే ‘‘వివాదాస్పద భూభాగంలో జీ20 మీటింగ్ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి మీటింగులకు మేం హాజరవ్వం” అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ శుక్రవారం తెలిపారు. దీనికి మన దేశం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘‘మా భూభాగంలో మాకు నచ్చిన చోట మీటింగులు పెట్టుకునే స్వేచ్ఛ మాకు ఉంది. చైనాతో సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే బార్డర్​లో శాంతి, సుస్థిరత అవసరం” అని శనివారం కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.  

భారీ బందోబస్తు.. 

జీ20 మీటింగ్​కు సభ్య దేశాల నుంచి 60 మంది డెలిగేట్స్ వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్ బీ బలగాలను మోహరించారు.