కేంద్రం గ్రీన్ సిగ్నల్ : వరంగల్ కు సైనిక్ స్కూల్

కేంద్రం గ్రీన్ సిగ్నల్ : వరంగల్ కు సైనిక్ స్కూల్

వరంగల్ కు సైనిక్ స్కూల్ ఏర్పాటుకు చేసేందుకు కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని అమేథీ, మైన్ పురి, ఉత్తరాఖండ్ లో రుద్ర-ప్రయాగ్, మహారాష్ట్రలోని చంద్రాపూర్ కూడా వీటిని ఏర్పాటు చేయనుంది. 2021 అక్టోబర్ నుంచి ఈ బడులు ప్రారంభం అవుతాయని తెలిపారు అధికారులు. చిన్న రాష్ట్రాల్లో ఒక్కో సైనిక పాఠశాల చొప్పున నెలకొల్పాలని కేంద్రం ప్లాన్ చేస్తోందని తెలిపారు అధికారులు.

గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను నిర్వహిస్తున్న రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ.. సైనిక స్కూల్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ క్రమంలో కేంద్రం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో గిరిజన సంక్షేమ శాఖ చర్యలు వేగవంతం చేసింది.