కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..ఫ్రీ రేషన్ గడువు పొడగింపు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..ఫ్రీ రేషన్ గడువు పొడగింపు

ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఫ్రీ రేషన్ను మరో 3 నెలలు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30 తో ఫ్రీ రేషన్ గడువు ముగుస్తుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ కారణంగా 2020 మార్చిలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఏడాది మార్చిలో పథకం ముగియాల్సి ఉన్నా.. సెప్టెంబర్ 30 వరకు పొడగించారు. తాజాగా మరో 3 నెలలు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాబోయే పండగ సీజన్ ను దృష్టిలో పెట్టుకుని పెంచినట్లు తెలుస్తోంది. ఈ స్కీం ద్వారా 80 కోట్లకుపైగా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు.

కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తీపికబురు అందించింది కేంద్రం. ఉద్యోగులకు చెల్లించే డీఏను 4 శాతం పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో ఉద్యోగుల 38 శాతానికి చేరునుంది. దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు, 62 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఈ ఏడాది మార్చిలో ఉద్యోగులకు కేంద్రం 3 శాతం డీఏ పెంచింది. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచడంతో రాష్ట్రాలు కూడా తమ ఉద్యోగులకు ఆ మేర డీఏ పెంచే అవకాశం ఉంది.