రైతుబంధుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

రైతుబంధుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

రైతుబంధు నిధుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతుబంధు నిధులను లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ పద్దతిలో పంపినీ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఉండే సైలెన్స్ పీరియడ్ లోనూ, పోలింగ్ జరిగే రోజున కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయడం ఎలాంటి ప్రభావాన్ని చూపదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 18న చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ఈసీ.. శుక్రవారం ( నవంబర్ 24) ఈ ఉత్తర్వులను జారీచేసింది. నవంబర్ 24 నుంచి ఎప్పుడైనా నగదు బదిలీని ప్రారంభించుకోవచ్చని  క్లారిటీ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. 

నవంబర్ 18న రైతు బంధు కింద రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా సీఈవో ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తిచేసింది. ఏ తేదీనుంచి మొదలు పెట్టి ఎప్పటికి పూర్తి చేస్తారో నిర్దిష్టంగా షెడ్యూల్ ను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది సీఈసీ..రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. నవంబర్ 24 నుంచి రైతు బంధు పంపిణీ చేసుకోవచ్చని తెలిపింది.