కొవిడ్ బాధితుల కోసం కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ 

V6 Velugu Posted on May 06, 2021

సెంకడ్ వేవ్ తో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కొవిడ్ బాధితుల కోసం కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. గత జూలైలో ఉన్న కొత్త మార్గదర్శకాలకు.. పలు మార్పులు చేసింది. కరోనా స్వల్ప లక్షణాలున్నా, లక్షణాలు లేకున్నా ఇంటికే పరిమితం కావాలని సూచించింది కేంద్రం. బీపీ, షుగర్‌ ఉన్నవారు డాక్టర్ల సలహా పాటించాలని..కరోనా బాధితులు మూడు పొరల మాస్క్‌ ధరించాలంది. వీలైనంత ఎక్కువగా నీరు, ద్రవ ఆహారం తీసుకోవాలని సూచించింది.ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని.. ఐసోలేషన్‌ నుంచి 10రోజుల తర్వాత బయటికి రావొచ్చని తెలిపింది. చివరి మూడు రోజుల్లో జ్వరం రాకపోతే కరోనా పరీక్ష అవసరం లేదని కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాల్లో తెలిపింది కేంద్ర ప్రభుత్వం.

Tagged Central government, issued new guidelines, corona victims

Latest Videos

Subscribe Now

More News