తెలంగాణకు 2 వేల 751 ఈ–బస్సులు మంజూరు చేశాం: పెద్దపల్లి ఎంపీ ప్రశ్నకు కేంద్రం సమాధానం

తెలంగాణకు 2 వేల 751 ఈ–బస్సులు మంజూరు చేశాం: పెద్దపల్లి ఎంపీ ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణకు వివిధ పథకాల కింద మొత్తం 2,751 ఎలక్ట్రిక్ (ఈ–బస్సులు) మంజూరు చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం లోక్‌‌‌‌‌‌‌‌సభలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో పాటు పలువురు అడిగిన ప్రశ్నకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

కేంద్రం అమలు చేస్తున్న వివిధ స్కీమ్‌‌‌‌‌‌‌‌ల ద్వారా తెలంగాణలోని ప్రధాన నగరాలకు ఈ బస్సులను కేటాయించామని తెలిపారు. పీఎం–ఈ డ్రైవ్ స్కీమ్ కింద అత్యధికంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు 2,200 బస్సులు మంజూరు చేశామని చెప్పారు.

పీఎం–ఈ బస్ సేవా స్కీమ్ కింద వరంగల్‌‌‌‌‌‌‌‌కు100 బస్సులు కేటాయించామని పేర్కొన్నారు. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌కు ఇదే పథకం కింద 51 బస్సులను సాంక్షన్ చేశామని వెల్లడించారు. పర్యావరణ హిత రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా పీఎం–ఈ డ్రైవ్ స్కీమ్ కింద మొత్తం 23,800 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసినట్టు మంత్రి వివరించారు. దీనికి అదనంగా పీఎం–ఈ బస్ సేవా పథకం ద్వారా మరిన్ని బస్సులను వివిధ రాష్ట్రాలకు కేటాయించినట్టు స్పష్టం చేశారు.