
హైదరాబాద్, వెలుగు: కరోనా లక్షణాలు ఉన్న పిల్లలకు టీకాలు వేయొద్దని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. పిల్లలకు జ్వరం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే టీకాల కోసం రావొద్దని తల్లులకు సూచించాలని కేంద్ర ఆరోగ్యశాఖ గైడ్‌లైన్స్ జారీ చేసింది. కంటైన్మెంట్ ఏరియాలు మినహా ఇతర ప్రాంతాల్లో గర్భిణులు, చిన్న పిల్లలకు రెగ్యులర్ వ్యాక్సిన్లు, చెకప్‌లు కొనసాగించాలని చెప్పింది. కంటైన్మెంట్ జోన్లలో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించొద్దని ఆదేశించింది. వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా చూడాలని చెప్పింది.