Duleep Trophy 2025: RCB కెప్టెన్ ఖాతాలో మరో టైటిల్.. దులీప్ ట్రోఫీ విజేత సెంట్రల్ జోన్

Duleep Trophy 2025: RCB కెప్టెన్ ఖాతాలో మరో టైటిల్.. దులీప్ ట్రోఫీ విజేత సెంట్రల్ జోన్

2025 దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్ నిలిచింది. సోమవారం (సెప్టెంబర్ 15) ముగిసిన ఫైనల్లో సౌత్ జోన్ పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో చివరి రోజు 65 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్ జోన్ 4 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసి టైటిల్ అందుకుంది. ఈ ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ట్రోఫీ  అందించిన రజత్ పటిదార్.. సెంట్రల్ జోన్ కు టైటిల్ అందించడం విశేషం. 11 ఏళ్ళ తర్వాత సెంట్రల్ జోన్ దులీప్ ట్రోఫీ టైటిల్ అందుకోవడం విశేషం. 

65 పరుగుల స్వల్ప టార్గెట్ తో ఐదో రోజు బ్యాటింగ్ కు దిగిన సెంట్రల్ జోన్ ఆరంభంలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టెన్షన్ లో పడింది. ఈ దశలో కెప్టెన్ పటిదార్.. ఓపెనర్ అక్షయ్ వాడ్కర్ 25 పరుగులు జోడించి జట్టును గెలుపు అంచులకు తీసుకొని వచ్చారు. 13 పరుగులు చేసి పటిదార్ ఔటైనా.. యష్ రాథోడ్ తో కలిసి అక్షయ్ మ్యాచ్ ను ఫినిష్ చేశాడు. సెంట్రల్ జోన్ తరపున యష్ రాథోడ్ తొలి ఇన్నింగ్స్ లో 194 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సిరీస్ మొత్తం నిలకడగా రాణించిన సరాంశ్ జైన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే..  టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 63 ఓవర్లలో 149 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది. తన్మయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (31) టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కోరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. సల్మాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (24), అంకిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ (20) ఓ మాదిరిగా ఆడారు. స్పిన్నర్లు సారాన్ష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (5/49), కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్తికేయ (4/53) మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముందు సౌత్ జోన్ నిలవలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 511 పరుగులకు ఆలౌటై 362 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది. యష్ రాథోడ్ 194 పరుగులు చేయడంతో పాటు పటిదార్ (101) సెంచరీతో రాణించాడు.

రెండో ఇన్నింగ్స్ లో రెండు వికెట్ల నష్టానికి 129 పరుగులతో ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో ఆదివారం నాలుగో రోజు ఆట కొనసాగించిన సౌత్‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 121 ఓవర్లలో 426 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. దాంతో 65 రన్స్‌‌‌‌‌‌‌‌ టార్గెట్ ను మాత్రమే సెంట్రల్ జోన్ ముందు ఉంచగలిగింది. చివరి రోజు 65 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్ జోన్ 4 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసి విజయం సాధించి టైటిల్ అందుకుంది.