పాన్ కార్డు రూల్స్ లో భారీ మార్పులు..వెహికల్స్ కొనాలన్నా పాన్ కార్డు చూపించాల్సిందే

పాన్ కార్డు రూల్స్ లో భారీ మార్పులు..వెహికల్స్ కొనాలన్నా పాన్ కార్డు చూపించాల్సిందే
  • రూ.10 లక్షలపైబడిన డిపాజిట్లకు పాన్​ తప్పనిసరి
  • విత్​డ్రా చేసినా ఇవ్వాల్సిందే..
  • హోటల్​ఖర్చు రూ.లక్ష దాటినా చెప్పాల్సిందే..

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను నిబంధనల్లో భారీ మార్పులు ప్రతిపాదించింది.  ఇక నుంచి క్యాష్​ లావాదేవీలు, వెహికల్స్​ కొనుగోలు, ఆస్తుల బదిలీకి సంబంధించి పాన్ కార్డు సమర్పించాల్సిన పరిమితులను పెంచింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్లు లేదా విత్ డ్రాయల్స్ చేస్తే పాన్ తప్పనిసరి.

ప్రస్తుతం బ్యాంకుల్లో ఒక రోజులో రూ.50 వేలు దాటితే పాన్ అడుగుతున్నారు.  ఇక నుంచి కారు అయినా, టూవీలర్ అయినా సరే.. దాని ధర రూ.5 లక్షలు దాటితేనే పాన్ కార్డు వివరాలు ఇవ్వాలి. గతంలో కారు కొంటే మాత్రమే పాన్​ అడిగేవాళ్లు. హోటల్​, రెస్టారెంట్ ఖర్చులు, కన్వెన్షన్ సెంటర్లు లేదా ఈవెంట్ మేనేజ్​మెంట్ చెల్లింపులు రూ. లక్ష దాటితే పాన్ ఇవ్వాలి.

ప్రస్తుతం హోటల్ బిల్లుల విషయంలో ఈ పరిమితి రూ.50 వేలే ఉంది. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం, బహుమతి  లావాదేవీ విలువ రూ.20 లక్షలు దాటితే పాన్ వివరాలు సమర్పించాలి. పాత నిబంధన ప్రకారం ఈ పరిమితి రూ.10 లక్షలు దాటితే పాన్​ కార్డు నంబరు ఇవ్వాలి.