కేంద్ర ఉద్యోగుల గిఫ్ట్​ పాలసీలో మార్పులు

కేంద్ర ఉద్యోగుల గిఫ్ట్​ పాలసీలో మార్పులు

ఇకపై రూ.5 వేల విలువైన బహుమతులు తీసుకోవచ్చు

న్యూఢిల్లీ: ఉద్యోగులు తమ రిలేటివ్స్ లేదా ఫ్రెండ్స్ కానివాళ్ల దగ్గర్నుంచి గిఫ్టులు తీసుకునే విషయంలో రూల్స్​ను  సడలిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.  గ్రూప్​ ఏ, గ్రూప్​ బి కేటగిరీ కిందికి వచ్చే ఉన్నతాధికారులు, గెజిటెడ్​, నాన్​ గెజిటెడ్​ ఆఫీసర్లు ఇకపై రూ.5వేల విలువైన గిఫ్టుల్ని అఫీషియల్​గా తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఇంతకుముందు ఈ లిమిట్​ రూ.1500గా ఉంది. గ్రూప్​ సి కిందికొచ్చే క్లర్కులు, ఇతర సిబ్బంది విషయానికొస్తే గిఫ్ట్​ విలువ లిమిట్​ను రూ.500 నుంచి రూ.2వేలకు పెంచారు. ఆలిండియా సర్వీసుల్లో పనిచేస్తున్నవాళ్లతో సమానంగా కేంద్ర ఉద్యోగుల గిఫ్ట్​ సీలింగ్​ పరిమితిని సవరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఫారిన్​ డెలిగేట్స్​ నుంచి పొందే గిఫ్టుల విషయంలోనూ వెయ్యి రూపాయల పరిమితిని తొలగించారు. ఫ్రీగా ప్రయాణాలు, హోటళ్లలో బస ఇతరత్రా ప్రయోజనాలను కూడా గిఫ్ట్​ కిందే పరిగణిస్తారు. ఆ మేరకు ఉద్యోగులు లెక్కలు చూపాల్సి ఉంటుంది.

Centre relaxes gift policy for employees, hikes monetary limits