పెట్రో ఎగుమతులపై పన్నుల్లో మార్పులు

పెట్రో ఎగుమతులపై పన్నుల్లో మార్పులు
  •     డీజిల్​పై రూ.12 నుంచి రూ.7.5కు తగ్గింపు
  •     పెట్రోల్​పై రూ. 1.5 నుంచి రూ. నాలుగు కు పెంపు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ , డీజిల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్స్​ను మంగళవారం మార్చింది. ఈనెల నుంచి ఈ కొత్త పన్ను రేట్లు అమల్లోకి వస్తాయి.  పెట్రోల్ ఎగుమతులపై విధించే ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని రూ. 1.5 నుంచి రూ. నాలుగుకు పెంచారు.

 డీజిల్ ఎగుమతులపై పన్నును రూ. 14 నుంచి రూ. 8.5 కు తగ్గించారు. విమాన ఇంధనం (ఏటీఎఫ్) ఎగుమతులపై పన్నును రూ. 12.5 నుంచి రూ. 7.5 కు కుదించారు. దేశీయంగా ఇంధన లభ్యతను పెంచేందుకు , అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరల ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశీయ వినియోగం కోసం సరఫరా చేసే పెట్రోల్ , డీజిల్ పై పన్నులను మార్చలేదని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ శ్రీలంకతో పాటు మారిషస్ మాల్దీవులకు చేసే ఎగుమతులపై పన్ను మినహాయింపును కొనసాగిస్తారు.