ప్రీ-ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాలేషన్ తప్పనిసరి కాదు ..సంచార్ సాథీ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేంద్రం యూ–టర్న్

ప్రీ-ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాలేషన్ తప్పనిసరి కాదు ..సంచార్ సాథీ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కేంద్రం యూ–టర్న్

న్యూఢిల్లీ: మొబైల్ కంపెనీలు కొత్తగా తయారు చేసే సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లలో సంచార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాథీ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇన్ బిల్ట్​గా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై గతంలో జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు బుధవారం వెల్లడించింది. 

పోగొట్టుకున్న ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ట్రాక్ చేయడానికి, సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరాల నుంచి రక్షణ కోసం కొత్తగా వచ్చే సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లలో సంచార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాథీ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇది ప్రజల ప్రైవెసీ, డేటా గోప్యతా ఉల్లంఘనలకు దారితీస్తుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 

ఎవరితో సంప్రదించకుండా  ఏకపక్షంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించాయి. ఈ క్రమంలోనే కేంద్రం వెనక్కి తగ్గింది. కాగా.. ఇప్పటివరకు 1.4 కోట్ల మంది వినియోగదారులు సంచార్ సాథీ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేసుకున్నారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఓ ప్రకటనలో తెలిపింది. వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోందని తెలిపింది. ఈ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పౌరులు ఉంచిన విశ్వాసానికి ఇదే నిదర్శనమని పేర్కొంది.