మే డే వేడుకల్లో చాడకు ఎండ దెబ్బ!

మే డే వేడుకల్లో చాడకు ఎండ దెబ్బ!
  • జెండా ఆవిష్కరిస్తూ తూలి పడబోగా పట్టుకున్న కార్మికులు 

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్‌‌లోని బోయిన్‌‌పల్లి మార్కెట్‌‌లో శుక్రవారం నిర్వహించిన మే డే వేడుకల్లో సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి తగిలి అస్వస్థతకు గురయ్యారు. కార్మిక దినోత్సవం సందర్భంగా ఎర్ర జెండాను ఆవిష్కరిస్తున్న సమయంలో తూలి కింద పడబోగా, గమనించిన కార్మికులు, పార్టీ కార్యకర్తలు ఆయనను పట్టుకున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తిందని, కొద్దిసేపటికి ఆయన స్పృహలోకి వచ్చారని నేతలు తెలిపారు.