కాంట్రాక్ట్,అవుట్‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి..మంత్రి జూపల్లికి చాడ వెంకటరెడ్డి వినతి 

కాంట్రాక్ట్,అవుట్‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి..మంత్రి జూపల్లికి చాడ వెంకటరెడ్డి వినతి 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌‌‌‌ లో 23 ఏండ్లుగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని మాజీ ఎమ్మెల్యే, సంఘం గౌరవాధ్యక్షుడు చాడ వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా టూరిజం కార్పొరేషన్ ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 61 ఏండ్లకు పెంచాలన్నారు. టూరిజం ప్లాజాలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. గతంలో అమలులో ఉన్న రిస్క్ అలవెన్స్, బస్సు పాసు సౌకర్యం, గ్రాట్యూటీ వంటి ప్రయోజనాలను పునరుద్ధరించాలన్నారు. మానవతా దృక్పథంతో ప్రభుత్వం స్పందించి పర్యాటక శాఖలోని కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.