హైదరాబాద్ లో వివాహితను వేధించిన  కానిస్టేబుల్పై కేసు 

హైదరాబాద్ లో  వివాహితను వేధించిన  కానిస్టేబుల్పై కేసు 

దిల్‌‌‌‌సుఖ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు: వివాహితను వేధింపులకు గురిచేసిన కానిస్టేబుల్‌‌‌‌పై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఓ మహిళ(30) భర్తతో కలిసి హైదరాబాద్‌‌‌‌ చైతన్యపురి డివిజన్‌‌‌‌కు చెందిన హనుమాన్ నగర్‌‌‌‌‌‌‌‌లో నివసిస్తున్నారు. వీరికి కొడుకు, కుమార్తె ఉన్నారు.‌‌‌‌  2020లో హనుమాన్ నగర్‌‌‌‌‌‌‌‌లోని ఓ అపార్ట్‌‌‌‌మెంట్స్‌‌‌‌లో ఉండగా చిక్కడపల్లి పోలీస్‌‌‌‌స్టేషన్‌‌‌‌లో కానిస్టేబుల్‌‌‌‌గా పనిచేస్తున్న ఇక్కలూరి వెంకటేశ్‌‌‌‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం భర్తకు విషయం తెలియడంతో  రాంనగర్‌‌‌‌కు వెళ్లారు.

అయినప్పటికీ ఆమెతో సంబంధం కొనసాగించాడు. ఈక్రమంలో వెంకటేశ్ ఆమెతో రహస్యంగా ఉన్న టైంలో ఫొటోలు, వీడియోలను తీసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి హనుమాన్ నగర్‌‌‌‌లో  లేడీస్ హాస్టల్‌‌‌‌ ప్రారంభించారు. విషయం తెలుసుకున్న భర్త.. ఆమెను పుట్టింటికి పంపించాడు. 2024లో పెద్దమనుషుల నచ్చచెప్పడంతో భర్తతో కలిసి ఆ మహిళ చైతన్యపురిలో ఉంటున్నారు. అనంతరం వెంకటేశ్‌‌‌‌.. ఆమెను తన దగ్గర ఫొటోలు, వీడియోలు ఉన్నాయని వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులు భరించలేక భర్తతో కలిసి చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంకటేశ్‌‌‌‌పై కేసు 
నమోదు చేశారు.