హైదరాబాద్‎లో 93.13 శాతం మందికి పోలియో చుక్కలు

హైదరాబాద్‎లో 93.13 శాతం మందికి పోలియో చుక్కలు

హైదరాబాద్ సిటీ, వెలుగు:  హైదరాబాద్ వ్యాప్తంగా ఆదివారం 93.13 శాతం మంది ఐదేండ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. మొత్తం 5,17,238 మంది ఐదేండ్లలోపు పిల్లలు ఉండగా, ఆదివారం రికార్డు స్థాయిలో 4,81,706 మంది చిన్నారులకు చుక్కలు వేశారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పర్యాటక ప్రాంతాల వంటి రద్దీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రాన్సిట్ పాయింట్ల ద్వారా ప్రయాణాల్లో ఉన్న మరో 4,504 మందికి కూడా పోలియో చుక్కలు వేశారు. తొలిరోజు పోలియో చుక్కలు వేయించుకోలేకపోయిన వారి కోసం సోమవారం నుంచి వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ తిరిగి చుక్కల మందు వేసే కార్యక్రమం నిర్వహించనున్నారు. మేడ్చల్​మల్కాజిగిరి జిల్లాలో 4,87,845 మందికి చుక్కలు వేశారు.