హైకోర్టు సీజే ముందుకు.. డీకే అక్రమాస్తుల కేసు

హైకోర్టు సీజే ముందుకు.. డీకే అక్రమాస్తుల కేసు

బెంగళూరు :  కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అక్రమాస్తుల కేసు రోజుకో మలుపు తిరుగుతోం ది. ఈ కేసు విచారణకు గత బీజేపీ సర్కారు ఇచ్చిన సమ్మతిని ప్రస్తుతం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు వాపస్ తీస్కోవ డం చెల్లదని సీబీఐ అధికారులు హైకోర్టుకెక్కారు. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు.

వీటిని శుక్రవారం విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి కృష్ణ ఎస్ దీక్షిత్.. ఈ కేసు విచారణను హైకోర్టు డివిజన్ బెంచ్​కు అప్పగించాలని సూచిం చారు. ఈ కేసులో పెద్ద పెద్ద ప్రశ్నలు లేవనెత్తే అవకాశాలున్నాయని, డివిజన్ బెంచ్ మెరుగైన పరిష్కా రం చూపించగలదని అన్నారు.