బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం నిరుద్యోగుల తెలంగాణగా మారింది : గడ్డం వంశీ కృష్ణ

 బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం నిరుద్యోగుల తెలంగాణగా మారింది : గడ్డం వంశీ కృష్ణ

మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. కేసీఆర్ ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తారని నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. గత పది సంవత్సరాలుగా బిఆర్ ఎస్, బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ నిరుద్యోగుల తెలంగాణగా మారిందని చెప్పారు.  చదువుకున్న యువత ఉపాధి హామీ కూలీ పనులు వెళ్తున్నారని తెలిపారు. 

నిరుద్యోగులను పట్టించులేదు గాని కేసీఆర్ ఇంట్లో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక దందా,భూ కబ్జాలు,ఉద్యోగాలు అమ్ముకున్నారని ఫైర్ అయ్యారు.  తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని అనుకుంటే అప్పుల పాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రభుత్వ సంస్థలు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. 

రైతులకు మేలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. త్వరలో రైతులకు రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే కనుమూస్తానని కాకా వెంకటస్వామి చెప్పారని వంశీ కృష్ణ అన్నారు.  కాక స్ఫూర్తి తో రాజకీయాల్లోకి సేవ చేయడానికి వస్తున్న నన్ను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే పెద్దపల్లిలో ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకువస్తానని తెలిపారు గడ్డం వంశీ కృష్ణ.