ఇండియా కూటమి ఆధ్వర్యంలో నేడు(అక్టోబర్ 08) ‘చలో లోక్ భవన్’

ఇండియా కూటమి ఆధ్వర్యంలో  నేడు(అక్టోబర్ 08) ‘చలో లోక్ భవన్’
  •     పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఇచ్చిన పిలుపులో భాగంగా పీసీసీ ఆధ్వర్యంలో  గురువారం చలో లోక్ భవన్ పేరుతో నిరసన ర్యాలీ, సభ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి లోక్ భవన్ వరకు ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని ఇండియా కూటమి నేతలు పేర్కొన్నారు. 

ఈ ఆందోళనలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలు పాల్గొననున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్  విజ్ఞప్తి చేశారు.