- బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ విమర్శలకు చామల కౌంటర్
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో గురువారం జరిగింది రాష్ట్ర కేబినెట్ మీటింగ్ కాదని.. అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ఢిల్లీలో జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మతి తప్పి మాట్లాడుతున్నారని గురువారం ప్రకటనలో ఫైర్ అయ్యారు.
రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ఈ నెల 23 న ఉందని, ఈ విషయం హరీశ్ రావు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని తెలిపారు. ఇటు పంచాయతీ.. అటు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలవడంతో హరీశ్ రావు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
