కాళేశ్వరంపై ఉన్న ప్రేమ..నల్గొండ, పాలమూరుపై ఎందుకు లేదు?..హరీశ్పై చనగాని దయాకర్ ఫైర్

కాళేశ్వరంపై ఉన్న ప్రేమ..నల్గొండ, పాలమూరుపై ఎందుకు లేదు?..హరీశ్పై చనగాని దయాకర్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రేమ నల్గొండ, పాలమూరు ప్రాజెక్టులపై ఎందుకు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావును పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పదేండ్ల పాటు  అధికారంలో ఉన్న బీఆర్ఎస్...పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయిందని నిలదీశారు. 

అసెంబ్లీలో మొఖం చెల్లకపోవడంతో హరీశ్ రావు పారిపోయి వచ్చి తెలంగాణ భవన్ లో సాగునీటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలోనే నల్గొండ, పాలమూరు జిల్లాలకు సాగునీటి రంగంలో  తీరని అన్యాయం జరిగిందని విమర్శించారు.