సీఎం కేసీఆర్ బాగానే అభివృద్ధి చేస్తుండు

సీఎం కేసీఆర్ బాగానే అభివృద్ధి చేస్తుండు

తెలంగాణను టీఆర్ఎస్ పార్టీ కూడా బాగానే అభివృద్ధి చేస్తోందని అన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కారణం తానేనన్న చంద్రబాబు.. హైటెక్ సిటీ ఊరికే అయ్యిందా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో 40శాతం సీట్లు యువతకు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో టీడీపీ సభ్యత్వం పెంచాలన్న ఆయన.. కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ తీసుకొచ్చినట్లు చెప్పారు. పార్టీ ఆవిర్భవించిన ప్రాంతమైన తెలంగాణలో టీడీపీని కాపాడుకుంటామని, రాష్ట్రంపై ప్రత్యేక ఫోకస్ పెడతామని అన్నారు.