బీజేపీ నేతలను ఆంధ్రాలో తిరగనివ్వం

బీజేపీ నేతలను ఆంధ్రాలో తిరగనివ్వం

 అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు… టీడీపీ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ చేసిన ప్రసంగాన్ని సీఎం చంద్రబాబు అడ్డుకున్నారు. ఈ సమయంలో…. సీఎం ప్రసంగంపై బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం చెప్పారు. సభలో రచ్చ చేసిన బీజేపీ ఎమ్మెల్యేలపై ఆవేశంతో ఊగిపోయారు సీఎం చంద్రబాబు. “బీజేపీ నేతలు సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారు… రక్తం మరిగిపోతోంది, అడిగే వాళ్ళు లేరనా…?” అని సీరియస్ అయ్యారు. “మిమ్మల్ని తిరగనివ్వం…ఏమనుకుంటున్నారో” అని ఓ రేంజ్ లో మండిపడ్డారు సీఎం చంద్రబాబు. కేంద్రంలో అధికారంలో ఉంటూ… కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు ఏమిచ్చారు అని ప్రశ్నించారు.

పోలవరం నిర్మాణంపై బాబు సవాల్

“సౌత్ ఇండియా లో బీజేపీకి ఒక్క లీడర్ లేరు? ఉన్న ఒక్క వెంకయ్య నాయుడుని కేబినెట్ నుంచి పంపేశారు. అన్ని రాష్ట్రాల తిరిగే వెంకయ్యను ప్రభుత్వం నుంచి పక్కన.పెట్టారు!? అసలు సౌత్ ఇండియా నేతలకు ఏమి గౌరవం ఇచ్చారో చెప్పాలి” అన్న చంద్రబాబు.. పోలవరం నిర్మాణంపై సవాల్ విసిరారు. దేశంలో ఏ జాతీయ ప్రాజెక్ట్ ఐనా పోలవరం అంత వేగంగా నిర్మాణం జరుగుతుందా అని ప్రశ్నించారు. పోలవరం అంత వేగంగా ఏదైనా జాతీయ ప్రాజెక్ట్ నిర్మితం అవుతుందంటే… రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు. పోలవరంపై ఓర్వలేరా…..నీళ్లు వస్తే అభివృద్ధి కాదా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.