మా పోరాటం రాజకీయాల కోసం కాదు: చంద్రబాబు

మా పోరాటం రాజకీయాల కోసం కాదు: చంద్రబాబు

ప్రజాస్వామ్యన్ని పరిరక్షించాలని ఎన్నికల కమిషన్ ను కోరినట్టు చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో ఈసీ కమిషనర్లతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈసీని కలిసి తమకున్న అభ్యంతరాలను వివరించామన్నారు. తమ పోరాటం రాజకీయాల కోసమో, రాజకీయ పార్టీల కోసమో కాదని.. ఓటేసిన ఓటరు తాను అనుకున్న గుర్తుకే ఓటేశాడని నమ్మకం కోసమే తమ పోరాటమన్నారు.

ఏపీ లో క్యాబినెట్ ఎప్పుడు పెట్టాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని,  ఈ నెల 10లేదా 12, 13 తేదీలలో క్యాబినెట్ సమావేశం నిర్వహిస్తామని చంద్రబాబు అన్నారు. సీఎస్ సమావేశాన్ని అమలు చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఈవీఎంలు పని చేయలేదని, ఈ విషయంలో బీజెపి తమపై ఎదురుదాడి చేస్తుందని అన్నారు.  ప్రజస్వామ్యాన్ని, విశ్వసనీయతను కాపాడుతారో లేదో ఎన్నికల సంఘం తేల్చుకోవాలని చంద్రబాబు అన్నారు.