నా రింగ్ ధర రూ.30వేలు..ఇండియాలో దొరకదు: చంద్రబాబు

నా రింగ్ ధర రూ.30వేలు..ఇండియాలో దొరకదు: చంద్రబాబు

ఢిల్లీ, వెలుగు: టీడీపీ అధినేత చంద్రబాబు లైఫ్ నిజంగా రింగ్ లోనే ఉంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు చెప్పారు. అంతే కాదు. ఆ రింగ్ పని చేస్తోన్న తీరును  వివరించారు. మంగళవారం ఢిల్లీలో తెలుగు మీడియాతో ఇంట్రాక్ట్ అయిన ఆయన..  తన రింగ్ ప్రత్యేకత గురించి చెప్పారు. ఈ చిప్ ఆధారంగా తన రింగ్ పని చేస్తుందని..ఫోన్ కు ఇది కనెక్టయి ఉంటుందన్నారు. తన బాడీలోని మార్పులు ముఖ్యంగా..ఆక్సిజన్ లెవల్, బీపీ, షుగర్ వంటి అనేక సలహాలను ఫోన్ లో చూపిస్తుందన్నారు. రింగ్ కు చార్జింగ్ అవసరమని చెప్పారు.  ఈ రింగ్ తో  రేడియేషన్ సమస్య లేదని.. రింగ్ ద్వారా ఫోన్లో రికార్డైన తన హెల్త్ డిటైల్స్ మీడియా ప్రతినిధులకు చూపించారు. ఈ సందర్బంగా తన ఆరోగ్య సమస్యలకు సంబంధించిన అనేక విషయాలను చంద్రబాబు వివరించారు. అయితే ఎప్పటి నుంచి రింగ్ వాడుతున్నారనే విషయాన్ని ఆయన  చెప్పలేదు.  
 
ఇంకా ఇండియాలో రిలీజ్ కాలే...

బ్యూటీ ఆఫ్ టెక్నాలజీని తాను ప్రమోట్ చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. తాను వాడుతున్న రింగ్ ధర రూ. 30 వేలని అన్నారు. అయితే  ఇండియాలో ఇంకా ఈ రింగ్ రిలీజ్ కాలేదని..  అమెరికాలో మాత్రం రిలీజ్ అయిందని వెల్లడించారు. తాను ఇతరులకు మోడల్ గా నిలవాలని కోరుకుంటానని.. అందులో భాగంగా ప్రమోట్ చేస్తున్నట్లు చెప్పారు.