
సికింద్రాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ కు ప్రజలు వీఆర్‌ఎస్ ఇచ్చినా ఆ పార్టీ నేతలు మారడం లేదని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం పోయిందన్న మనో వేదనతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోను 420 అని సంబోధించడాన్ని నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద దయాకర్ నేతృత్వంలో కేటీఆర్ చిత్రపటాలను దహనం చేశారు.
ప్రజలు బీఆర్‌ఎస్ ను నమ్మి పదేళ్లు రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఉద్యోగాలు భర్తీ చేయలేదని, ప్రభుత్వ యూనివర్సిటీలను గాలికి వదిలేశారని విమర్శించారు. ఎన్‌ఎస్‌యూఐ నేతలు మేడ శ్రీను, మహేశ్ గౌడ్ పాల్గొన్నారు.