హైదరాబాద్: బక్రీద్ సెలవు తేదీని మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం మే 28న బక్రీద్ సెలవు ప్రకటించింది. ఈ మేరకు ‘ఎక్స్’లో ట్వీట్ కూడా పోస్ట్ చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా బక్రీద్ సెలవును 27కు బదులు 28న ప్రకటించిన సంగతి తెలిసిందే.
Change of Holiday on the occasion of Bakrid on 28-05-2026 instead of 27-05-2026. pic.twitter.com/EBCaYrONwh
— IPRDepartment (@IPRTelangana) May 23, 2026
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా బక్రీద్ సెలవును మే 28వ తేదీన ప్రకటించింది. బక్రీద్ అంటే బకర్.. ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువని, ఈద్ అంటే పండుగని అర్థాలు ఉన్నాయి. జంతువును ఖుర్బానీ (దానం ) ఇచ్చే పండుగ కాబట్టి దీనిని ఈదుల్ ఖుర్బానీ అని కూడా అంటారు.
ముస్లింలు సంవత్సరాన్ని హిజ్రీ అనే పేరుతో పిలుచుకుంటారు. హిజ్రీ అంటే వలసపోవడం అని అర్థం. మహ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనాకు తరలివెళ్లడాన్ని హిజ్రీగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలన్నది ఇస్లాం మత సూత్రాలలో ఇదొకటి. త్యాగనిరతితో పాటు మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలను కూడా విడిచిపెట్టి మానవత్వాన్ని వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలోని ప్రధాన పరమార్థం దాగి ఉంది.
