చార్ ధామ్ యాత్రకు బ్రేక్.. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, విరిగిపడిన కొండచరియలు

చార్ ధామ్ యాత్రకు బ్రేక్.. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, విరిగిపడిన కొండచరియలు

ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో చార్ ధామ్ యాత్రకు బ్రేక్  పడింది. కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు డ్యామేజ్ కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో వైపు ఉత్తరాఖండ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ముందస్తుగా కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రికి వెళ్లే యాత్రికుల రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. యాత్రికుల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.  యాత్రికులు ఎవరినీ అనుమతించవద్దని, ఇప్పటికే దారిలో ఉన్న యాత్రికులకు స్థానికులు అధికారులు సురక్షిత ప్రదేశాలలో వసతి కల్పించారు.  

భారీ వర్షాలతో  స్థానికంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నారు. అలకనంద, మందాకినీ నదులలో నీటి ప్రమాదర స్థాయిలో ప్రవహిస్తోంది.  రుద్ర ప్రయాగ్ జిల్లాలో మరింత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. నమామి గంగే ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేసిన ఘాట్‌లు నీట మునిగినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే ఈ సీజన్ లో వాతావరణ అనుకూలించనప్పటికీ  చార్ ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు వచ్చినట్లు ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ చెబుతోంది. ఆదివారం సాయంత్రానికి 44.8 లక్షల మందికి పైగా భక్తులు చార్‌ధామ్ పుణ్యక్షేత్రాలను ,హేమకుండ్ సాహిబ్‌ను సందర్శించినట్లు తెలుస్తోంది. బద్రీనాథ్‌ను 15.2 లక్షల మందికి పైగా సందర్శించగా, ఆ తర్వాత కేదార్‌నాథ్‌ను 14.0 కోట్ల మంది, గంగోత్రిని సుమారు 7 లక్షల మంది, యమునోత్రిని 6లక్షల 46వేల  మందికి పైగా సందర్శించారు. హేమకుండ్ సాహిబ్‌ను 2లక్షల పైగా యాత్రికులు సందర్శించినట్లు ఉత్తరా ఖండ్ పర్యాటక శాఖ ప్రకటించింది.