డుమ్మా డాక్టర్లకు ‘చార్ట్‌‌‌‌’ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌

డుమ్మా డాక్టర్లకు ‘చార్ట్‌‌‌‌’ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌

డ్యూటీ డాక్టర్ల వివరాలతో హాస్పిటల్స్‌‌‌‌లో చార్ట్‌‌‌‌లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సరిగా డ్యూటీలు చేయని గవర్నమెంట్‌‌‌‌ డాక్టర్లకు చెక్‌‌‌‌ పెట్టేందుకు వైద్యారోగ్యశాఖ కొత్త ఆలోచన చేసింది. ప్రతి హాస్పిటల్‌‌‌‌లో డాక్టర్ల పేర్లు, ఫొటోలు, వాళ్ల స్పెషలైజేషన్‌‌‌‌, హోదా వంటి వివరాలతో ఓ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అంతేకాదు, ఏ రోజు ఏ డాక్టర్‌‌‌‌‌‌‌‌ డ్యూటీలో ఉంటారో తెలిపే మరో చార్ట్‌‌‌‌నూ ప్రదర్శించనున్నారు. దీంతో అందుబాటులో ఉన్న డాక్టర్ల వివరాలు రోగులకు తెలియడంతోపాటు, డ్యూటీలకు డుమ్మా కొట్టిన డాక్టర్లపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుందని వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వైద్య విధాన పరిషత్‌‌‌‌ పరిధిలోని 110 హాస్పిటళ్లలో ఈ నెల నుంచే ఈ విధానం ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే డాక్టర్ల హాజరుకోసం బయోమెట్రిక్ అమల్లోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చర్యలతో డుమ్మా డాక్టర్లకు చెక్‌‌‌‌ పడనుందని భావిస్తున్నారు.

హాస్పటల్‌‌‌‌కు ఒక్కరిద్దరే..

వైద్య విధాన పరిషత్ పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా, జిల్లా హాస్పిటళ్లలో డాక్టర్ల కొరత ఉంది. 4,500 మంది డాక్టర్లకు కేవలం 2,100 మందే పనిచేస్తున్నారు. ఇందులోంచే డ్యూటీలకు రావడం లేదని ఇటీవల 79 మందిని తీసేశారు. మొత్తంగా టీవీవీపీలోని ఖాళీలు 2,500లకు చేరాయి. ఉన్నదే అరకొర డాక్టర్లు, వాళ్లు కూడా డ్యూటీలకు డుమ్మా కొడుతుండడాన్ని ఆఫీసర్లు సీరియస్‌‌‌‌గా తీసుకున్నారు. ఇటీవల పలు జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. చాలా హాస్పటల్స్‌‌‌‌లో ఒకరిద్దరే డ్యూటీలో ఉండడం, మిగతా వారు ‘డ్యూటీ ఆఫ్‌‌‌‌’, చెప్పకుండా లీవ్‌‌‌‌ తీసుకోవడాన్ని గమనించారు. ఈ నేపథ్యంలోనే డ్యూటీ రోస్టర్ తప్పనిసరిగా పాటించాలని డాక్టర్లకు ఆదేశాలిచ్చారు. ప్రతి దవాఖానలో రోగులకు డాక్టర్ల వివరాలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

వరుసగా డ్యూటీ.. ఆపై డుమ్మా

డాక్టర్లు రోజూ 6 గంటలు డ్యూటీలో ఉండాలి. కానీ, ఇలాఉంటే ప్రైవేట్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌కు ఇబ్బందులుంటాయని భావిస్తున్న డాక్టర్లు.. ఒకేసారి రెండ్రో జులపాటు ఫుల్ డ్యూటీ చేస్తున్నారు. ఇందుకు ఒకరికొకరు సహకరించుకుం టుంటారు. దాదాపు 50% హాస్పటల్స్‌‌‌‌లో ఇదే తంతు. దీన్ని కంట్రోల్‌‌‌‌ చేసేందుకే చార్ట్‌‌‌‌లను ప్రిపేర్‌‌‌‌ చేస్తున్నారు.