గూగుల్ క్రోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోటీగా చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీపీటీ అట్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

గూగుల్ క్రోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పోటీగా చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీపీటీ అట్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: గూగుల్ క్రోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి పోటీగా  ఓపెన్ఏఐ తన ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్ “చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీపీటీ అట్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌”ను లాంచ్ చేసింది.  ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ సెర్చ్ ఇంజిన్‌‌గా మారింది.  దీని ద్వారా ఓపెన్ఏఐకి డిజిటల్ అడ్వర్టైజింగ్ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీపీటీకి ఇప్పటికే 80 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 

వీరిలో చాలామంది ఉచిత యూజర్లే. అట్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రౌజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా యూజర్లు వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ ఓపెన్ చేసినప్పుడు “ఆస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీపీటీ” అనే సైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బార్  కూడా కనిపిస్తుంది. ఇది ఫ్లైట్ బుకింగ్, డాక్యుమెంట్ ఎడిటింగ్ వంటి పనులను చేయగలదు. “ఏజెంట్ మోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌”లో  యూజర్ తరఫున పనులను పూర్తిగా చేస్తుంది. 

ఈ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.  చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీపీటీ అట్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గూగుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షేర్లు మంగళవారం 5 శాతం క్రాష్ అయ్యాయి. బుధవారం మాత్రం 1.30 శాతం రికవర్ అయ్యాయి. కాగా, 71.9శాతం గ్లోబల్ బ్రౌజర్ మార్కెట్ షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గూగుల్ క్రోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతోంది.