మై ఆటో ఈజ్​ సేఫ్

మై ఆటో ఈజ్​ సేఫ్

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అమలు
ఐటీ కారిడార్ లో తిరిగే ఆటోలకు తప్పనిసరి

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్ లో తిరిగే ఆటోలకు ‘మై ఆటో ఈజ్ సేఫ్’ పేరుతో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. శనివారం నుంచి ఈ నెల 9 వరకు ఆటో యజమానులు, డ్రైవర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఆటోవాలాల ఆగడాలతో ప్రజలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలో జర్నీ చేసే మహిళా ప్యాసింజర్ల పట్ల డ్రైవర్లు అసభ్యంగా ప్రవర్తించడం, వస్తువులను దొంగిలించడం, అజాగ్రత్తగా ఆటోలు డ్రైవ్ చేయడం లాంటి ఘటనలపై పోలీస్ స్టేషన్లకు కంప్లయింట్ లు ఎక్కువగా వస్తున్నాయి.

సైబరాబాద్ పరిధిలో ఆటోల్లో వెళ్లే ఎంప్లాయీస్, మహిళలు, చిన్నారులు, సీనియర్ సిటిజన్స్ భద్రతను దృష్టిలో పెట్టకుని ‘మై ఆటో ఈజ్​సేఫ్’ అనే ఈ ప్రోగ్రాం చేపడతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అదే విధంగా ఆటో డ్రైవర్లు, యజమానులు కచ్చితంగా ట్రాఫిక్​ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఆటోలో యజమాని, డ్రైవర్​ ఫోన్​ నెంబర్, వివరాలు, ఒక వేళ ఆటో డ్రైవర్లు ర్యాష్​ డ్రైవింగ్​ చేస్తే కంప్లైంట్​ చేసేందుకు పోలీస్​స్టేషన్​ ఫోన్​నెంబర్​లతో కూడిన వివరాలు ఆటోలో ఉంటాయని తెలిపారు.

సైబరాబాద్​ పరిధిలో రిజిస్ర్టేషన్​ సెంటర్

అటో యజమానులు, డ్రైవర్లు మై ఆటో ఈజ్ సేఫ్​అని రిజిస్ర్టేషన్​ చేసుకునేందుకు సైబరాబాద్​ పోలీసులు సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో ఇనార్బిట్​ మాల్​ వద్ద ఉన్న  పోలీస్ అవుట్​పోస్ట్, కూకట్ పల్లి మెట్రో స్టేషన్​ వద్ద ఉన్న కూకట్ పల్లి పాత ట్రాఫిక్​ పోలీస్ స్టేషన్లో, ఆరాంఘర్​ చౌరస్తా వద్ద  న్న రాజేంద్రనగర్​ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్ లో, పేట్​బషీరాబాద్​సెయింట్​ఆన్స్​ స్కూల్​ వద్ద ఉన్న అల్వాల్​ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్లలో రిజిస్ర్టేషన్లు చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు.

కావాల్సిన డాక్యుమెంట్లు

సైబరాబాద్​ పరిధిలో రోడ్లపై తిరిగే ప్రతి ఆటో డ్రైవర్లు, యజమానులు రిజిస్ర్టేషన్​ కోసం తమ వివరాలను తప్పనిసరిగా పొందుపర్చాలి. దీంతో పాటు ఆటోకు సంబంధించిన డాక్యుమెంట్స్​ను పోలీస్​స్టేషన్​కు తీసుకెళ్లి రిజిస్ర్టేషన్​చేయించుకోవాలి.