రాష్ట్రవ్యాప్తంగా తనికీలు.. భారీగా నగదు స్వాధీనం

రాష్ట్రవ్యాప్తంగా తనికీలు.. భారీగా నగదు స్వాధీనం

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా తనికీలు చేపట్టారు పోలీసులు. ఇందులో భాగంగా.. భారీ మొత్తంలో నగదు, లిక్కర్ ను పట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ.. 5 కోట్ల 32 వేల రూపాయల నగదు సీజ్ అవగా.. 41 లక్షల విలువైన 13 వేల 82 లీటర్ల లిక్కర్ పట్టుబడినట్టు పోలీసులు చెప్పారు. దీంతో పాటు.. 2 కోట్ల 83 వేల 800 రూపాయల విలువైన గోల్డ్, సిల్వర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆపరేషన్స్ నిర్వహించినట్టు చెప్పారు. 182 మందిపై కేసులు నమోదు అయినట్లు పోలీసులు చెప్పారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున..  8 వేల 153 వెపన్స్ ను డిపాజిట్  చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా.. రోడ్డు మర్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి…. ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నట్టు తెలిపారు. సిటీలో ప్రధానమైన ప్రాంతాలలో కూడా ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనికీలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.