శంషాబాద్ లో చిరుత సంచారం!

శంషాబాద్ లో చిరుత సంచారం!

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండల పరిధిలోని ఘన్సిమియగూడలో శనివారం రాత్రి నర్సింహా అనే రైతు పొలంలో కుక్క, లేగ దూడపై గుర్తుతెలియని జంతువు దాడి చేసింది. ఈ దాడిలో లేగ దూడ మృతి చెందగా, కుక్కకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో ఘటనా స్థలాన్ని పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ఆదివారం పరిశీలించారు. గ్రామంలో చిరుత సంచరిస్తోందని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.