ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 39వ చెన్నయ్ షాపింగ్ మాల్ బ్రాంచ్ ను బుధవారం ప్రముఖ సినీనటి శ్రీముఖి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తాను పుట్టిన ఊరు ఆర్మూర్ లో షాపింగ్ మాల్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నాణ్యతతో ప్రజలకు అందుబాటులో ఉండే వస్త్రాలు కేవలం చెన్నయ్ షాపింగ్ మాల్ లోనే లభిస్తాయని తెలిపారు.
కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మర్రి వెంకట్‌రెడ్డి, డైరెక్టర్ కృష్ణారావు, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి పాల్గొన్నారు.
