కేసీఆర్​ బెల్టు షాపులు పెట్టి .. చదువుకోమంటున్నారు.. చెన్నూరు కాంగ్రెస్​ ర్యాలీలో తీన్మార్​ మల్లన్న

కేసీఆర్​ బెల్టు షాపులు పెట్టి .. చదువుకోమంటున్నారు.. చెన్నూరు కాంగ్రెస్​ ర్యాలీలో తీన్మార్​ మల్లన్న

తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది.  చెన్నూరులో కాంగ్రెస్​ ర్యాలీలో   వివేక్​ వెంకటస్వామి... తీన్మార్​ మల్లన్న.. నల్లాల ఓదేలు పాల్గొన్నారు.  రోడ్​ షోలో జరిగిన సభలో తీన్మార్​ మల్లన ఉద్వేగ భరితంగా ప్రసంగించారు.

  • చెన్నూరులో కాంగ్రెస్​ అభ్యర్థి వివేక్​ వెంకటస్వామి గెలుపు ఖాయం
  • బాల్క సుమన్​ గురించి మాట్లాడుకోవడం దండగ... చెన్నూరులో కేసీఆర్​ కు వివేక్​ వెంకటస్వామికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. 
  • ఓడిపోయే బాల్క సుమన్​ గురించి మాట్లాడటం దండగ
  • హ్యాపీరావు.. డ్రామారావు.. పోసెట్టి ...పులి... కాపలా కుక్క... కేసీఆర్​ ఇల్లు జూ పార్క్​లా తయారైంది
  • ఓడిపోతున్నామని కేసీఆర్​ కు అర్దమైంది. 30వ తేదీ సాయంత్రం సీఎం రాజీనామా  చేయడం కోసం గవర్నర్​ అప్పాయింట్​ మెంట్​ తీసుకున్నారు 
  • గజ్వేల్​ లో కేసీఆర్​ పరిస్థితి ఎలా ఉందో తెలియదు.. హరీష్​ పరిస్థితి అటో ఇటో ఉంది....  రామన్న గెలుస్తడో లేదో తెలియదు
  • చెన్నూరులో ఇసుక ఎత్తుకెళ్లి స్మశానాన్ని కట్టారు
  • కేసీఆర్​ కు వైన్​ షాపుల మీదన్న సోయ నీళ్ల మీద లేదు
  • ఉదయం 10 గంటలకే వైన్​ షాపులు తీస్తారు.. తాగేందుకు నీళ్లు మాత్రం ఇవ్వరు
  • కేసీఆర్​ బెల్టు షాపులు పెట్టి చదువుకోమంటున్నరు.. బెల్టు షాపుల్లో ఎలా చదువుకుంటారని ప్రశ్నించిన తీన్మార్​ మల్లన్న 
  • కేసీఆర్​ కుటుంబం తెలంగాణ ప్రజల రక్తం దోచుకుంది
  • మన ఇంట్లో దొంగతనం చేసి.. మన  డబ్బులు మనకే పంచుతున్నరు
  • కేసీఆర్​ పెట్టిన మందు షాపుల్లో తాగాలి.. స్మశానంలో పండాలి.. రైతులు చస్తే బీమా ఇస్తమంటరు
  • చెన్నూరులో ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయి కాని... కేసీఆర్​ డబుల్​ బెడ్​ రూం ఇళ్లు లేవు
  • తెలంగాణ కోసం తల్లి సోనియాగాంధీకి ఎదురుగా వివేక్​ వెంకటస్వామి నిల్చున్నారు
  • ఉద్యోగాల నోటిఫికేషన్స్​ ​ సక్సెస్​ కాలేదు కాని... వైన్​ షాపుల టెండర్ల నోటిఫికేషన్స్​ సక్సెస్​ అయ్యాయి
  • భూలోకంలో కేసీఆర్ పెద్ద పాము ​.. కట్లపాము బాల్క సుమన్​
  • తెలంగాణను సంపదను  కొల్లగొట్టిన పెద్ద పాము కేసీఆర్​
  • మేడిగడ్డను బూడిదపై కట్టారు
  • తల్లి సోనియా మహిళల గురించి ఆలోచిస్తున్నారు.. మహిళలకు ఉచిత బస్​ ప్రయాణం
  • కేసీఆర్​ కుమార్తె కవిత సారా దందా చేశారు... చర్యలు ఎందుకు తీసుకోలేదు
  • కేసీఆర్​, మోదీ .. దంతాలు లేని పులుల మాదిరిగా గాండ్రిస్తున్నారు
  • బాల్కసుమన్​ డబ్బులిచ్చి ఓటెయ్యమంటే నామీద ఒట్టేసి కాంగ్రెస్​ కు ఓటెయ్యండి
  • నోటు సుమన్​ ది... ఒట్టు మల్లన్నది... ఓటు  వివేక్​ కు
  • ముదిరాజు తల్లి పాలు తాగి..ఆ తల్లి కడుపులో కేసీఆర్​ తన్నాడు
  • కేసీఆర్​ ను బొందపెట్టే టైం వచ్చింది
  • కేసీఆర్​ పదేళ్ల నుంచి తెలంగాణ బిడ్డల రక్తం తాగారు 
  • చెన్నూరును బాల్కసుమన్​ ను నాశనం చేశారు
  • చెన్నూరులో వివేక్​ వెంకటస్వామి 5 లక్షల ఇళ్లు కట్టిస్తారు
  • ఇంటి స్థలం లేని వారికి స్థలంతో పాటు రూ. 5 లక్షలు
  • వివేక్​ ఎంపీగా  ఉన్నప్పుడు 150 మించి కరంట్​ బిల్​ రాలేదు
  • 200 యూనిట్ల వరకు  కరంట్​ ఉచితం... మహిళా సోదరులకు రూ. 2500, గ్యాస్​ సిలెండర్​ రూ. 500
  • చెన్నూరు మాఫియా పోవాలంటే వివేక్​ వెంకటస్వామిని గెలిపించాలి