ఏం చేసినా చట్టం ప్రకారం చేస్తా.. ఈడీ దాడుల్లో ఏం దొరకదు: వివేక్ వెంకటస్వామి

ఏం  చేసినా చట్టం ప్రకారం చేస్తా.. ఈడీ దాడుల్లో ఏం దొరకదు: వివేక్ వెంకటస్వామి

ఈడీ దాడులకు భయపడనన్నారు  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  తన కంపెనీలపై ఎన్ని సార్లు దాడులు చేసినా ఏం దొరకదని చెప్పారు. తాను కష్టపడి..నీతి నిజాయితో  పైకొచ్చానని చెప్పారు.  ఓయూలో  వివేక్ వెంకటస్వామిని టీజేఏసీ, ఓయూజేఏసీ  సన్మానించింది. ఈ సందర్బంగా మాట్లాడిన వివేక్ వెంకటస్వామి.. తన కంపెనీలపై ఇటీవల ఈడీ దాడులు చేసింది అయినా భయపడను.. తాను ఏం చేసినా చట్టం ప్రకారం చేస్తానని చెప్పారు. ఎన్ని రోజులు దాడులు చేసినా  ఏం దొరకదని చెప్పారు.  అంబేద్కర్ కాలేజీలో 2 లక్షల మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని చెప్పారు. పేద విద్యార్థులకు బెస్ట్ ఎడ్యూకేషన్ అందిస్తున్నామన్నారు.

కేసీఆర్ సీఎం అయ్యాక తన స్వభావం మార్చుకున్నారని విమర్శించారు వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ సీఎం అయ్యాక నీళ్లు, నియామకాల గురించి మర్చిపోయారని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వకుండా...కేసీఆర్ తన ఫ్యామిలీకి పదవులిచ్చుకున్నారని విమర్శించారు. కాళేశ్వరంలో లక్ష కోట్లు ఖర్చు చేశారు.. మిషన్ భగీరథలో  ఎన్నో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అవినీతి సీఎంకు ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారు..ప్రజాపాలన తెచ్చారన్నారు. మొదటి రోజు నుంచే సీఎం రేవంత్ అధ్బుతంగా పాలిస్తున్నారని కొనియాడారు.  ఆరు గ్యారంటీల ద్వారా ప్రజలకు మంచి జరుగుతుంది.. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశాం..త్వరలోనే నాలుగు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.

 తెలంగాణ ఉద్యమంలో ఉద్యమంలో ఓయూ స్టూడెంట్స్ పాత్ర చాలా  పెద్దదన్నారు. రాష్ట్రమంతా ఉద్యమం ఒక ఎత్తు..ఓయూది ఒక ఎత్తు అని అన్నారు.  ఓయూలో ఏం జరుగుతుందోనని.. కేసీఆర్ మానిటర్ చేసేవారన్నారు.   ఉద్యమాన్ని ఎంతో మంది హేళన చేశారు..  పోలీసులు ఎంతో ఇబ్బంది పెట్టేవారన్నారు.  ఉద్యమంలో కాకా పోరాటం కూడా పెద్దదన్నారు.  రాష్ట్రాన్ని చూసే చనిపోతానని కాకా చెప్పారు.పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత టీజేఏసీదేనని చెప్పారు.