- కాలె యాదయ్య జోక్యాన్ని నియంత్రించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు : ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య జోక్యాన్ని నియంత్రించాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ కు చేరుకొని మెట్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన యాదయ్య పార్టీ, నామినేటెడ్ పదవులన్నింటినీ ఆయన సన్నిహితులకే కట్టబెడుతున్నారని ఆరోపించారు. మొదటి నుంచీ కాంగ్రెస్ లో ఉన్న వారికి పదవులు దక్కకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాదయ్యకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ప్రదర్శించారు. కొద్దిసేపటి తర్వాత ధర్నా విరమించారు.
