హైదరాబాద్:రాష్ట్రంలో పల్స్ పోలియో సక్సెస్...లక్ష్యాన్ని మించి 101.4 శాతం కవరేజీ

హైదరాబాద్:రాష్ట్రంలో పల్స్ పోలియో సక్సెస్...లక్ష్యాన్ని మించి 101.4 శాతం కవరేజీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలను ఇచ్చిందని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 40,97,749 మంది చిన్నారులు ఉన్నట్లు అంచనా వేయగా, 41,53,185 మందికి పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించారు. దీంతో నిర్దేశిత లక్ష్యాన్ని మించి 101.4 శాతం కవరేజీని సాధించినట్లు పేర్కొన్నరు. కేవలం పోలియో బూత్‌‌ లకే పరిమితం కాకుండా ప్రతి గడపకూ వెళ్లి చిన్నారులను గుర్తించే ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. 

ముఖ్యంగా వలస కార్మికులు నివసించే ప్రాంతాలు, భవన నిర్మాణ స్థలాలు, బస్తీలు, హైరిస్క్ ఏరియాలు, చైల్డ్ కేర్ హోమ్స్‌‌ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. మరోవైపు పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కావడంతో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. అంకితభావంతో పనిచేసిన వైద్యులు, అధికారులు, ఏఎన్‌‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌‌వాడీ సిబ్బంది, వలంటీర్లను ఆయన అభినందించారు.